: 24 గంటల్లో సోలార్ ప్యానల్స్ తయారీ పరిశ్రమకు చైనా కంపెనీ భూమి పూజ!
విశాఖపట్నంలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సులో చైనా కంపెనీ ఒకటి ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది. అయితే 24 గంటల్లోనే కంపెనీ నిర్మాణానికి భూమి పూజ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అచ్యుతాపురం సెజ్ లో చైనాకు చెందిన ట్రినాసోలార్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ఇవాళ భూమి పూజ నిర్వహించింది. దాంతో దేశంలోనే తొలి సోలార్ ప్యానల్స్ తయారీ పరిశ్రమ ఏర్పాటు కానుండటం విశేషం. 95 ఎకరాల్లో రూ.3వేల కోట్లతో ఈ పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఈ పరిశ్రమ ద్వారా 3,500 మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి.