: గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్ ఇదే!


గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల షెడ్యూలును కొద్ది సేపటి క్రితం అధికారులు విడుదల చేశారు. మొత్తం 150 వార్డులకు ఈ ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైందని తెలిపారు. 17వ తేదీ వరకూ నామినేషన్లను స్వీకరిస్తారు. ఈ మధ్యలో 14, 15 తేదీల్లో భోగి, సంక్రాంతి సెలవుల కారణంగా నామినేషన్ల స్వీకరణ ఉండదు. ఆపై నామినేషన్ల పరిశీలన 18న జరుగుతుంది. ఉపసంహరణకు 21వ తేదీ వరకూ గడువుంటుంది. అభ్యర్థుల తుది జాబితా సైతం అదే రోజున విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 2న పోలింగ్, 5న కౌంటింగ్ జరుగుతుంది. పోటీ పడే అభ్యర్థులు నామినేషన్ డిపాజిట్ నిమిత్తం జనరల్ అభ్యర్థులైతే రూ. 5 వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలైతే రూ. 2,500 చెల్లించాల్సి వుంటుంది.

  • Loading...

More Telugu News