: మహిళలపై నిషేధం ఉన్న శని సింగనాపూర్ ఆలయానికి చైర్ పర్సన్ గా మహిళ!


శని సింగనాపూర్, మహారాష్ట్రలోని షిరిడీకి సమీపంలో ఉన్న ప్రఖ్యాత శనిదేవుని ఆలయం. దాదాపు 500 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో మహిళలు పూజలు చేసేందుకు అనుమతి లేదు. అటువంటిది దేవస్థాన బోర్డు చైర్ పర్సన్ గా ఓ మహిళకు అవకాశం దక్కింది. ఆమె పేరు అనితా సేథే. బోర్డులో సభ్యురాలిగా కూడా మరో మహిళకు స్థానం లభించింది. తాను ఆలయ సంప్రదాయాలను కొనసాగిస్తానని, తాను ఆలయంలోకి వెళ్లబోనని ఈ సందర్భంగా అనిత వ్యాఖ్యానించారు. కాగా, ఇటీవల నిబంధనలను తోసిరాజని శని దేవుని సన్నిధికి ఓ మహిళ వెళ్లడంతో, పెను వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఆపై ఆలయానికి సంప్రోక్షణ చేసి పూజా కార్యక్రమాలను కొనసాగించారు.

  • Loading...

More Telugu News