: రోహిత్ హాఫ్ సెంచరీ, ఇండియా సెంచరీ
పెర్త్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డే పోరులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు సంతృప్తికర ప్రదర్శన చూపుతోంది. ఓపెనర్ శిఖర్ ధావన్ అభిమానులను నిరాశపరుస్తూ, 9 పరుగులకే ఔట్ అయినప్పటికీ, రోహిత్ శర్మ తనదైన శైలిలో షాట్లు కొడుతూ, హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మొత్తం 67 బంతులను ఎదుర్కొన్న రోహిత్ 5 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 56 పరుగులు చేశాడు. మరో ఎండ్ లో విరాట్ కోహ్లీ 43 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 31 పరుగులు చేశాడు. 21వ ఓవర్లో భారత జట్టు 100 పరుగుల మైలురాయిని తాకింది. ప్రస్తుతం భారత స్కోరు 22 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 104 పరుగులు. శిఖర్ ధావన్ వికెట్ ను హాజెల్ వుడ్ తీసుకున్నాడు.