: 10 ఓవర్లలో హాఫ్ సెంచరీ పూర్తి... ఓ వికెట్ నూ కోల్పోయిన ధోనీ సేన


ఆస్ట్రేలియా పర్యటనలో తొలి వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ నిర్ణయం కరెక్టేనని టీమిండియా స్టైలిష్ బ్యాట్స్ మన్ నిరూపించాడు. శిఖర్ ధావన్ తో కలిసి భారత్ ఇన్నింగ్స్ ను ప్రారంభించిన అతడు, వచ్చీ రావడంతోనే ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 7 ఓవర్ల దాకా వికెట్ పడకుండా కాపాడుకుంటూ రాగా, ఏడో ఓవర్ లో శిఖర్ ధావన్ (9) జోస్ హాజిల్ వుడ్ బౌలింగ్ లో మిచెల్ మార్ష్ చేతికి దొరికిపోయాడు. ఆ తర్వాత టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ ఎంట్రీ ఇవ్వగా, రోహిత్ శర్మ తన ఫాంను కొనసాగిస్తున్నాడు. 10 ఓవర్లు ముగిసే సరికి 52 పరుగులు చేసిన భారత్, ఓ వికెట్ ను కూడా కోల్పోయింది. 12 ఓవర్లు ముగిసే సరికి ఓ వికెట్ నష్టానికి భారత్ 63 పరుగులు చేసింది. రోహిత్ (37), కోహ్లీ (12) క్రీజులో ఉన్నారు.

  • Loading...

More Telugu News