: 'బర్గర్' క్వీన్ ఆ గ్రామానికి ఇప్పుడు సర్పంచ్!


కొన్ని రోజుల క్రితం వరకూ 21 సంవత్సరాల రేఖా రాణి చండీఘడ్ లోని ఒక మాల్ లో 'బర్గర్ కింగ్' అనే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేసేది. ఆమె పని ప్రతీరోజూ బర్గర్లను ప్రై చేయడం. ఓ దళిత రైతు కుమార్తె అయిన రేఖ ఇప్పుడు హర్యానాలో అత్యంత పిన్నవయస్కురాలైన సర్పంచ్ గా ఎన్నికై కుటుంబపు పేరుప్రఖ్యాతులను మరింత పెంచింది. ఈ ఏడాది మూడు గ్రామాల్లో ఎన్నికలు జరగ్గా రేఖ తన ప్రత్యర్థి నిర్మలా కౌర్ ను 219 ఓట్ల తేడాతో ఓడించింది. ఇక్కడ ఆమె విజయంలో మరో అంశం కూడా ముడిపడి ఉంది. సుప్రీంకోర్టు ప్రత్యేక అనుమతితో ఎన్నికల్లో పోటీచేసి మరీ విజయాన్ని సొంతం చేసుకుంది. 1994 అక్టోబరు 20న జన్మించిన రేఖ పంచాయతీ ఎన్నికల ప్రకటన నాటికి 21 సంవత్సరాలకన్నా మూడునెలల తక్కువ వయసు ఉంది. అయితే ఎన్నికల ఇతర నియమ నిబంధనలపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలవడంతో ఈలోగా ఆమెకు ఇరవై ఒక్క ఏళ్లు నిండిపోయాయి. దీంతో సుప్రీం తీర్పు వచ్చే సరికి ఆమెకు మార్గం సుగమమైంది. దీనికితోడు గ్రామానికి ఎస్సీ (మహిళ) కేటగిరికి సర్పంచ్ పోస్టును కేటాయించారు. ఇక్కడ మనం పంచాయతీ ఎన్నికలలో హర్యానా ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యా అర్హతల నిబంధన గురించి చెప్పుకోవాలి. ఈ ఎన్నికలకు పోటీ చేయాలంటే జనరల్ అభ్యర్థి అయితే కనీసం మెట్రిక్యులేషన్... జనరల్ మహిళ, ఎస్సీ పురుష అభ్యర్థులైతే కనీసం ఎనిమిదవ తరగతి... అదే ఎస్సీ మహిళ అయితే కనీసం ఐదవ తరగతి చదివుండాలి. ఆ ప్రకారం ఆ గ్రామంలో ఈ కేటగిరిలో చదువుకున్నవారు కొద్దిమంది మాత్రమే ఉండటంతో రేఖ తండ్రి బన్సీలాలా కుమార్తెను ఎన్నికల్లో పోటీచేసే దిశగా ప్రోత్సహించాడు. అప్పటికే ఆమె 12వ తరగతి పూర్తిచేసింది. ఈ నేపధ్యంలో ఆమె నామినేషన్ దాఖలు చేసి తిరిగి ఉద్యోగంలో చేరిపోయింది. తరువాత జనవరిలో గ్రామానికి తిరిగివచ్చి ప్రచారం ప్రారంభించింది. అయితే తమ ఇంటిలో ఉన్న పరిస్థితుల కారణంగా తాను చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకోలేనని తెలిపింది. తనను రాజకీయాల్లోకి ప్రవేశించమని తన తండ్రి ప్రోత్సహించారని రేఖ తెలిపింది.

  • Loading...

More Telugu News