: రేపిస్టులకు నపుంసక శిక్ష వేయాలా... ఎంపీలను తేల్చమన్న సుప్రీం
దేశంలో చిన్నారులపై తరచూ జరుగుతున్న అత్యాచారాల నియంత్రణపై పార్లమెంటు సభ్యులు త్వరగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. రేపిస్టులను నపుంసకులుగా మార్చాలన్న సూచనపై కోర్టు స్పందిస్తూ, ఈ విషయంలో ఎంపీలే నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. మహిళా న్యాయవాదుల సంఘం తరపున దాఖలైన అభ్యర్థనపై స్పందించిన సుప్రీంకోర్టు తాము ప్రభుత్వానికి చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాల నియంత్రణకు కొన్ని సూచనలు చేయగలుగుతామని, అయితే దీనికి చట్టరూపం కల్పించే బాధ్యత పార్లమెంటు సభ్యులదేనని పేర్కొంది. జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఎన్.వి రమణల ధర్మాసనానికి చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడే వారిని నపుంసకులుగా మార్చాలనే అభ్యర్థన అందింది. కాగా అమెరికా, పోలెండ్ తదితర దేశాల్లో ఇటువంటి శిక్షలు అమల్లో ఉన్నాయి.