: భాగస్వామ్య సదస్సు రెండో రోజు రికార్డు... 282 ఒప్పందాలు, రూ.2 లక్షల పెట్టుబడులు


ఏపీ బిజినెస్ కేపిటల్ విశాఖలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సులో భాగంగా నిన్న రెండో రోజు సమావేశాల్లో రికార్డులు నమోదయ్యాయి. మొత్తం 282 ఒప్పందాలు కుదరగా, ఏకంగా రూ.1.90 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి రానున్నాయి. ఈ మేరకు నిన్న ఉదయం నుంచి రాత్రి దాకా జరిగిన ఒప్పందాల పర్వంతో చంద్రబాబు సర్కారు అనుకున్న దానికంటే మెరుగైన ఫలితాలనే సాధించినట్లైంది. ఈ ఒప్పందాలు కార్యరూపం దాల్చితే... రాష్ట్రంలో ఏకంగా 8 లక్షల కొత్త ఉద్యోగాలు యువతకు అందుబాటులోకి రానున్నాయి. నవ్యాంధ్రలో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతుండటంతో మరింత ఉత్సాహంగా కనిపించిన చంద్రబాబు, ప్రతి ఒప్పందం తన సమక్షంలో జరిగేలా ఉరుకులు పరుగులు పెట్టారు. మూడు రోజుల పాటు జరగనున్న భాగస్వామ్య సదస్సు నేటితో ముగియనుంది. ఇప్పటికే తొలి రెండు రోజుల్లో కుదిరిన ఒప్పందాలను ఓసారి పరిశీలిస్తే... మొత్తం 314 ఒప్పందాలు కుదరగా, రూ.3.89 లక్షల కోట్ల మేర పెట్టుబడులు రానున్నాయి. ఇక చివరి రోజైన నేడు కూడా ఇదే జోరు కొనసాగితే, రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు రూ.5 లక్షల కోట్లు దాటనున్నాయి.

  • Loading...

More Telugu News