: రెండు, మూడు సార్లు పడ్డాను... జూనియర్ ఎన్టీఆర్
'నాన్నకు ప్రేమతో' చిత్రం కోసం హోవర్ బోర్డుపై ప్రాక్టీస్ చేసే సమయంలో దానిపై నుంచి రెండు, మూడు సార్లు తాను కింద పడ్డానని జూనియర్ ఎన్టీఆర్ అన్నాడు. తానొక చోట, తన ఫోన్ మరొక చోట పడిపోగా, గాయాలు కూడా అయ్యాయన్నాడు. తాను గడ్డం పెంచుకుని పోషించిన పాత్రలున్న చిత్రాలు గతంలో ఉన్నప్పటికీ.. ఈ చిత్రంలో గడ్డం వేరని.. తన క్రాఫ్, గడ్డం చాలా స్టైలిష్ గా ఉన్నాయని యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడు.