: ఏపీలో మరిన్ని వాల్ మార్ట్ స్టోర్లు... కొత్తగా 15 స్టోర్లు వచ్చేస్తున్నాయి!


చిల్లర దుకాణాల మెడపై కత్తి వేలాడుతూనే ఉంది. ఆ కత్తికి మరింత పదును కూడా వచ్చేస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదుతో పాటు రెండు రాష్ట్రాల వ్యాప్తంగా పలు చోట్ల భారీ షాపింగ్ మాల్ లను ఏర్పాటు చేసిన వరల్డ్ చైన్ మార్కెట్ దిగ్గజం ‘వాల్ మార్ట్’... ఏపీలో మరింత మేర విస్తరించనుంది. ఈ మేరకు నేడు వాల్ మార్ట్ ఇండియా సీఈఓ క్రిష్ అయ్యర్ ఓ కీలక ప్రకటన చేశారు. ఏపీ వ్యాప్తంగా మరో 15 స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతేకాక అగ్రి ఉత్పత్తుల సేకరణ కోసం ఓ భారీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నామని ఆయన తెలిపారు. రానున్న ఏడాదిన్నరలోనే కొత్త స్టోర్లు కార్యకలాపాలు ప్రారంభిస్తాయని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News