: శరణార్థుల వల్ల యూరోపియన్ దేశాలను వేధిస్తున్న సామాజిక సమస్య
యూరోపియన్ దేశాలను మరో సంక్షోభం వేధిస్తోంది. మధ్యప్రాచ్య, ఆఫ్రికా దేశాల నుంచి వెల్లువెత్తిన వలసదారులకు ఆశ్రయం కల్పించాలని యూరోపియన్ దేశాలకు ప్రపంచం మొత్తం విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. దీంతో వివిధ దేశాల నుంచి పోటెత్తిన శరణార్థులకు ఆశ్రయం కల్పించారు. ఇప్పుడు వీరు ఆయా దేశాలకు తలనొప్పిగా తయారయ్యారు. ఇటీవలి కాలంలో యూరోపియన్ దేశాల్లో మహిళలపై సామూహిక అత్యాచారాలు పెరిగిపోయాయి. వివిధ దేశాల్లో నమోదవుతున్న సామూహిక అత్యాచారాలపై సాక్ష్యాలు సేకరించిన ఆయా దేశాల భద్రతాధికారులు ఆశ్చర్యపోయే వాస్తవాన్ని వెలికితీశారు. ఈ సామూహిక అత్యాచారాల వెనుక ఉన్నది శరణార్థులని అధికారులు కనుగొని షాక్ కు గురయ్యారు. కొత్త సంవత్సర వేడుకల తరువాత ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, ఫిన్ లాండ్, స్వీడన్, జర్మనీల్లో సామూహిక అత్యాచారాలు పెరిగిపోయాయి. న్యూఇయర్ తరువాత జర్మనీలో 150కి పైగా సామూహిక అత్యాచారాలు నమోదు కాగా, ఫిన్ లాండ్ రాజధాని హెల్ సింకీలో 50కి పైగా సామూహిక అత్యాచారాలు జరిగాయి. దీంతో రాత్రుళ్లు మహిళలు రోడ్లపైకి రాకూడదని, సమస్యాత్మక ప్రాంతాల్లోకి మహిళలు అస్సలు వెళ్లకూడదని ఫిన్ లాండ్ విజ్ఞప్తి చేసింది. ఈ సామూహిక అత్యాచారాలకు పాల్పడుతున్న వారిలో 95 శాతం మంది శరణార్థులేనని ఆయా దేశాలు వెల్లడించాయి. కేవలం 5 శాతం మంది స్థానికులు వీటిల్లో పాలు పంచుకుంటున్నారని ఆయా కేసులపై దర్యాప్తు చేసిన పోలీసులు వెల్లడించారు. శరణార్థుల్లో 20 నుంచి 30 ఏళ్ల లోపున్నవారే రేప్ లకు పాల్పడుతున్నారని అధికారులు వెల్లడించారు. తాజాగా నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జర్మనీలో జరిగిన గ్యాంగ్ రేప్ లలో 30 మందిని అరెస్టు చేయగా, వారిలో 9 మంది అల్జీరియన్లు, 8 మంది మొరాకో దేశీయులు, ఐదుగురు ఇరాకీలు, నలుగురు సిరియన్లు, ఇద్దరు జర్మన్లను అదుపులోకి తీసుకున్నారు. జరుగుతున్న ఘటనలపై ఆందోళనలు చేస్తూ మహిళలు వీధుల్లోకి రావడంతో వీటిపై ఆయా దేశాలు పెదవి విప్పకతప్పలేదు. మహిళల్లో అభద్రతాభావం పెరుగుతుందని, టూరిజం దెబ్బతింటుందని, అంతర్గత భద్రతపై అనుమానాలు రేగుతాయనే భయంతో ఈ ఘటనలపై ఇంతవరకు పెదవి విప్పలేదని, ఇప్పుడు విప్పక తప్పడం లేదని అధికారులు వెల్లడించారు. యూరోప్ లో మహిళలు స్వేచ్ఛగా ఉంటారు. స్కర్టులు ధరించి పబ్ లు, క్లబ్ లు, నైట్ షోలకు వెళ్తారు. దీనిని శరణార్థులు జీర్ణించుకోలేకపోతున్నారని, ఛాందసవాద భావజాలం కలిగిన దేశాల నుంచి వచ్చిన వారు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారని అధికారులు పేర్కొంటున్నారు. శరణార్థుల్లో సామాజిక మార్పు తేవడం ద్వారా ఇలాంటి సంఘటనలు రూపుమాపవచ్చని నార్వేకు చెందిన స్వచ్ఛంద సంస్థ చెబుతుండగా, ఆ దేశాలన్నీ శరణార్థులు ఎందుకీ చర్యలకు పాల్పడుతున్నారనే దిశగా శోధన మొదలుపెట్టాయి. ఫలితం తేలిన తరువాత చర్యలు తీసుకునే అవకాశం ఉంది.