: జీహెచ్ఎంసీ ఎన్నికలకు చంద్రబాబు ప్రచారం... షెడ్యూల్ ఖరారు


గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. ఇందుకోసం ప్రచార షెడ్యూల్ ఖరారైంది. మూడు రోజుల పాటు ఆయన గ్రేటర్ హైదరాబాద్ ప్రచారంలో పాల్గొంటారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించే రోడ్ షోల్లో బాబు పాల్గొంటారని తెలిసింది. గ్రేటర్ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాదించాలనుకుంటున్న టీటీడీపీ ఇప్పటికే ముమ్మర ప్రచారం చేస్తోంది. చంద్రబాబు ప్రచారంతో సీమాంధ్రులు ఎక్కువగా ఉన్న వార్డులు దక్కుతాయని పార్టీ ఆశిస్తోంది.

  • Loading...

More Telugu News