: త్వరలో మూతపడనున్న గ్వాంటెనామా బే జైలు... ఆదేశాలివ్వనున్న ఒబామా
అమెరికాలోని గ్వాంటెనామా బే జైలును మరికొన్ని నెలల్లో మూసివేయబోతున్నారు. ఈ మేరకు ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా ఆదేశాలు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఏడు సంవత్సరాల కిందట ఆయన ఇచ్చిన హామీని నిలబెట్టుకోబోతున్నారు. సెప్టెంబర్ 11దాడుల నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఈ జైలును మూసివేయించాలని ఒబామా పట్టుదలగా ఉన్నట్టు వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ డెనిస్ మెక్ డొనఫ్ చెప్పారు. ఆయన పదవీ కాలం 11 నెలల్లో ముగుస్తుందని, ఈ లోగానే జైలును మూసివేసేందుకు ఆదేశాలిస్తారని తెలిపారు. ప్రస్తుతం ఈ జైలు వల్ల ఉపయోగం లేదని, దీనిని నిర్వహణ చాలా ఖర్చుతో కూడుకున్నదని డొనప్ పేర్కొన్నారు. అయితే జైలు మూసివేత విషయంలో ఆ దేశ పార్లమెంట్ (కాంగ్రెస్)కు ఓ ప్లాన్ ను ఇచ్చి, వాళ్లేం చెబితే ఆ తరువాత తగిన నిర్ణయం తీసుకుంటానని మాత్రమే ఒబామా చెప్పారన్నారు.