: తమిళనాడు ఆలయాల్లో సంప్రదాయ డ్రెస్ కోడ్ నిబంధనపై హైకోర్టు స్టే
తమిళనాడులో ఆలయాల్లోకి ప్రతి ఒక్కరూ సంప్రదాయ దుస్తులు ధరించే వెళ్లాలన్న నిబంధనపై మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ స్టే ఇచ్చింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయాలకు వెళ్లే భక్తులందరూ సంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించే వెళ్లాలని 2015, నవంబర్ లో సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. దాన్ని తప్పకుండా అమలయ్యేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. తరువాత ఈ తీర్పును సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం ఇప్పుడు అప్పీలు చేయడంతో మధురై బెంచ్ పైవిధంగా స్పందించింది.