: పఠాన్ కోట్ ఘటనపై అత్యున్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించిన షరీఫ్


పంజాబ్ లోని పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై జరిగిన ఉగ్రదాడి ఘటనపై దర్యాప్తుకు ముందడుగు పడింది. దీనిపై అత్యున్నత స్థాయి దర్యాప్తు బృందాన్ని (జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీమ్) ఏర్పాటు చేయాలని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆదేశించారు. ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), ఇంటర్ సర్వీసెస్ (ఐఎస్ఐ), మిలటరీ (ఎంఐ) అధికారులతో ఇవాళ సమావేశమైన షరీఫ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉగ్రదాడిపై భారత్ ఆధారాలు అందించడం కూడా ఈ చర్యకు ముందడుగు పడేండుకు దోహదపడింది. అంతేగాక ఉగ్రదాడి సూత్రధారులపై చర్యలకు, ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శుల భేటీకి భారత్ ముడిపెట్టడంతో పాక్ ఈ దర్యాప్తుకు ముందుకొచ్చింది.

  • Loading...

More Telugu News