: మెక్సికన్ డ్రగ్ డాన్ ను పట్టించిన హాలీవుడ్ నటుడి సీక్రెట్ ఇంటర్వ్యూ
హాలీవుడ్ నటుడు సీన్ పెన్ చేసిన ఓ సీక్రెట్ ఇంటర్వ్యూ మెక్సికన్ డ్రగ్ డాన్ ను పట్టించింది. వివరాల్లోకి వెళ్తే...మెక్సికన్ మోస్ట్ వాంటెడ్ డ్రగ్ డాన్ 'జొవాకిన్ ఎల్ చాపో గుజ్మన్' తన జీవిత చరిత్రపై ఓ సినిమా నిర్మించాలని భావించాడు. దీంతో హాలీవుడ్ నటులు, నిర్మాతలను సంప్రదించాడు. గత అక్టోబర్ లో హాలీవుడ్ నటుడు సీన్ పెన్ దురాంగో రాష్ట్రంలో గుజ్మన్ ను కలిశాడు. ఈ సందర్భంగా అతనిని సీక్రెట్ గా ఇంటర్వ్యూ చేశాడు. ఈ ఇంటర్వ్యూను రోలింగ్ స్టోన్ అనే పత్రిక ప్రచురించింది. దాని ఆధారంగా గుజ్మన్ ఎక్కడున్నాడో పోలీసులు కనిపెట్టేశారు. దీంతో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి అతనిని పట్టేయాలని భావించారు. అయితే అప్పట్లో గుజ్మన్ పక్కన ఇద్దరు మహిళలు ఓ చిన్నారి ఉండడంతో ఆపరేషన్ ను మధ్యలోనే ఆపేశారు. తరువాత అతని కదలికలని జాగ్రత్తగా గమనించిన భద్రతా బలగాలు మోచీస్ లో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి అతనిని పట్టేశాయి.