: టీఎస్ కి హైదరాబాదు ఉంటే...ఏపీకి బాబున్నాడు: వెంకయ్యనాయుడు


తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాదు బ్రాండ్ అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బ్రాండ్ చంద్రబాబునాయుడు అని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అభివర్ణించారు. విశాఖపట్టణంలో జరుగుతున్న సీఐఐ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైదరాబాదుకు ఈ బ్రాండ్ వేల్యూ రావడానికి కారణమైన చంద్రబాబు ఇప్పుడు ఏపీలో ఉన్నాడన్న విషయం మరువొద్దని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తరువాత తనను సుమారు 40 దేశాల బ్రాండ్ అంబాసిడర్లు కలిసి ఉంటారని, వారంతా వివిధ విషయాల గురించి చర్చించిన తరువాత చంద్రబాబు పేరును ప్రధానంగా ప్రస్తావిస్తున్నారని ఆయన వెల్లడించారు. చంద్రబాబుకు ఉన్న బ్రాండ్ వేల్యూ వేరని ఆయన చెప్పారు. చంద్రబాబు ముందుచూపుతో వ్యవహరిస్తాడని, ఆయన దూరదృష్టి భవిష్యత్ తరాలకు వెలుగునిస్తుందని ఆయన తెలిపారు. ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోందని, అలాంటి భారత్ లో గుజరాత్ తరువాత ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయి పెట్టుబడులు ఆహ్వానిస్తోందని ఆయన తెలిపారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేవారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పూర్తి సహకారం ఉంటుందని ఆయన వివరించారు.

  • Loading...

More Telugu News