: ఏటా 8 లక్షల హిందువులు మతం మారుతున్నారట


దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మత మార్పిడుల అంశంపై ప్రతీరోజూ ఏదో ఒకచోట రాద్ధాంతం జరుగుతూనే ఉంది. ఈ నేపధ్యంలో తాజాగా వి.హెచ్.పి జాతీయ నేత వై.రాఘవులు మరోసారి మత మార్పిడులపై వ్యాఖ్యలు చేశారు. ప్రతీ ఏటా దేశంలో సుమారు 8 లక్షల మంది హిందువులు మతం మార్చుకుంటున్నారంటూ ఆయన వ్యాఖ్యానించడం వివాదాస్పదంగా మారింది. వీరంతా క్రిస్టియన్లుగానో లేదా ముస్లింలుగానో మారిపోతున్నారని రాఘవులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే దేశంలోని క్రైస్తవులు, ముస్లింలు మత మార్పిడులను ప్రోత్సహిస్తున్నారన్నారు.

  • Loading...

More Telugu News