: చలికి వణికిపోతున్న ఉత్తరాది
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలు చలికి తట్టుకోలేక గజగజ వణికిపోతున్నాయి. జమ్ములోని లేహ్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మైనస్ 14.7 డిగ్రీలకు పడిపోయాయి. ఇక ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 8.7గా నమోదయ్యాయి. కార్గిల్ లో రికార్డు స్థాయిలో మైనస్ 13 డిగ్రీల ఉష్ణోగ్రతలు చోటుచేసుకున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు చలికి తట్టుకోలేక పలు అవస్థలకు గురవుతున్నారు.