: జీవకళ ఉట్టిపడేలా రైళ్లకు రంగులు
దేశంలోని ప్రయాణికులు ఇన్నాళ్లూ ఒకే రంగుతో నడిచే రైళ్లను చూసి విసుగెత్తిపోయుంటారు. అందుకే దీనిని గుర్తించిన ప్రభుత్వం వచ్చే ఏడాదికల్లా అత్యంత ప్రకాశవంతమైన రంగులతో సెమీ.. హైస్పీడ్ రైళ్లను తయారుచేసి పట్టాలమీదకు ఎక్కించాలని భావిస్తోంది. గంటకు 160 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ రైళ్లకు ప్రకాశవంతమైన బూడిద, నీలం, పసుపు వర్ణాలను అద్దాలని భావిస్తోంది. అయితే వేగం ఆధారంగా రైళ్లకు ఈ రంగులను వేయనున్నారు. ఢిల్లీ- ఆగ్రా, ఢిల్లీ- కాన్పూర్, చెన్నయ్- హైదరాబాద్, ముంబయి- గోవాల మధ్య ఈ రైళ్లు నడవనున్నాయి.