: సల్వీందర్ చెబుతున్నది నిజమా? అబద్ధమా?... నేడు లై డిటెక్టర్ పరీక్ష!
తనను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి, తన కారును ఎత్తుకెళ్లి పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడి చేశారని చెబుతున్న గురుదాస్ పూర్ మాజీ ఎస్పీ సల్వీందర్ సింగ్ చెబుతున్న మాటలను విశ్వసించని ఎన్ఐఏ అధికారులు నేడు లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించనున్నారు. విచారణలో భాగంగా సల్వీందర్ ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడటంతో, ఆయనకు నిజ నిర్ధారణ పరీక్షలు చేయాలని భావించిన విచారణ బృందం, అందుకు తగ్గ అనుమతులు పొందినట్టు తెలుస్తోంది. ఢిల్లీలోని ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్ లో ఆయనకు లై డిటెక్టర్ పరీక్ష జరుగనుంది. ఈ పరీక్ష తరువాత, ఆయనకు ఉగ్రదాడిలో ప్రమేయం ఉన్నట్టు తేలితే, వెంటనే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.