: చదువులమ్మ ఒడిలో రత్నంగా మెరిసిన ఉగ్రవాది కొడుకు
భారత పార్లమెంటుపై దాడి జరిపిన కేసులో మూడేళ్ల క్రితం ఉరిశిక్షకు గురైన అఫ్జల్ గురు కుమారుడు గాలిబ్ గురు, తన పదవ తరగతి పరీక్షల్లో రాణించి, చదువులమ్మ ఒడిలో రత్నమై మెరిశాడు. జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం ప్రకటించిన టెన్త్ ఫలితాల్లో గాలిబ్ కు 95 శాతం మార్కులు వచ్చాయి. 500 మార్కులకు గాను గాలిబ్ 474 మార్కులు తెచ్చుకున్నాడని, అన్ని సబ్జెక్టుల్లో 'ఏ1' గ్రేడ్ లో నిలిచాడని తెలుస్తోంది. ఇప్పుడు గాలిబ్ పై సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, మొత్తం 498 మార్కులు తెచ్చుకున్న తాబిష్ మంజూర్ ఖాన్ ఈ సంవత్సరం తొలి ర్యాంకు సాధించాడు.