: కేంద్ర ఉద్యోగులకు నిరాశే... ఇప్పట్లో 'డీఏ' ప్రకటన లేనట్టే!
"దేవుడు వరమిచ్చినా, పూజారి కరుణించలేదు" అన్నట్టు 7వ వేతన సంఘం సిఫార్సులు వచ్చినా, కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ అలక్ష్యం కోట్లాది మంది ఉద్యోగులకు నిరాశనే మిగుల్చుతోంది. వేతనాల పెంపులో కీలకమైన డీఏ (డియర్నెస్ అలవెన్స్ - కరవు భత్యం) విషయమై నిర్ణయం మాత్రం వెలువడలేదు. ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ను కార్మిక శాఖ విడుదల చేసిన తరువాత మాత్రమే ఈ విషయమై ఓ ప్రకటన వెలువడుతుందని సమాచారం. తదుపరి గణాంకాలు ఈ నెలాఖరులో రానుండటంతో, ఫిబ్రవరిలో లేదా బడ్జెట్ తరువాత మాత్రమే డీఏ పెంపుపై నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. ప్రతి ఆరు నెలలకూ ఓమారు డీఏ పై సమీక్ష జరుగుతుంది. జూలైలో తీసుకున్న నిర్ణయం ప్రకారం, బేసిక్ వేతనంపై 119 శాతం డీఏ అమలవుతున్న సంగతి తెలిసిందే.