: ఆసీస్ సిరీస్ లో కనీసం ఒక వన్డే అయినా నెగ్గాల్సిందే
భారత్ నెంబర్ టూ ర్యాంకులో కొనసాగాలంటే ఆస్ట్రేలియా పర్యటనలో బారత్ జట్టు కనీసం ఒక వన్డే అయినా నెగ్గాల్సిందేనని గణాంకాలు చెబుతున్నాయి. లేని పక్షంలో భారత జట్టు నాలుగో ర్యాంకుకు జారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. 127 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న ఆసీస్ ను భారత్ జట్టు క్లీన్ స్వీప్ చేసినా ఆ జట్టు ర్యాంకింగ్స్ లో ఎలాంటి మార్పు కనిపించదు. అదే 114 పాయింట్లతో ఉన్న భారత జట్టును ఆసీస్ క్లీన్ స్వీప్ చేస్తే టీమిండియా ర్యాంకింగ్స్ లో అట్టడుగుకు పడిపోతుంది. కనీసం ఒక్క మ్యాచ్ నెగ్గినా రెండో ర్యాంకులోనే ఉంటుంది. లేని పక్షంలో భారత జట్టు స్థానంలోకి సౌతాఫ్రికా వచ్చి చేరుతుంది. దాని వెనుకే ఉన్న న్యూజిలాండ్ కూడా ర్యాంకింగ్ పెంచుకుంటుంది. కనుక టీమిండియా కనీసం ఒక్క మ్యాచ్ అయినా నెగ్గడం అనివార్యం.