: 3.5 కేజీల బంగారంతో పట్టుబడ్డ ప్రయాణికుడు


హైదరాబాదులోని శంషాబాదు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు మూడున్నర కిలోల బంగారం పట్టుకున్నారు. దుబాయ్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడు సీటు కింద 3.5 కేజీల బంగారం పెట్టుకుని వచ్చాడు. ప్రయాణికులు దిగిన అనంతరం తనిఖీలు నిర్వహించిన అధికారులు అతని సీటుకింద బంగారాన్ని గుర్తించారు. దీంతో అతనిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ బంగారం ఎక్కడిది? ఎవరిచ్చారు? ఎక్కడికి చేర్చాలి? వంటి విషయాలను అతని నుంచి రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News