: ఒక్క ప్రయాణికురాలి కోసం రైలు... అది జపాన్ ప్రభుత్వం బాధ్యత!
జపాన్ ప్రభుత్వం తన ప్రజల పట్ల ఎంత నిబద్ధతతో, బాధ్యతతో వ్యవహరిస్తుందన్న దానికి ఇది నిదర్శనం. ఆ దేశంలోని గిరిజన ప్రాంతమైన కామి-షిరాతకి అనే ఊళ్ల మధ్య ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రభుత్వం పలు రైళ్లను నిలిపేసింది. అయితే, ఆ మార్గంలో ఉదయం ఓ సారి, సాయంత్రం ఓ సారి ఒకే ఒక్క రైలును మాత్రం అక్కడి ప్రభుత్వం ఇప్పటికీ నడిపిస్తోంది. అది కూడా ఎందుకు కొనసాగిస్తోందంటే, ఆ మార్గంలో ఓ బాలిక స్కూలుకు వెళ్లి వస్తుంటుంది. ఆ పాపకు ఇబ్బంది కలగకుండా వుండడం కోసమే జపాన్ ప్రభుత్వం మిగతా రైళ్లను రద్దు చేసినా, ఆ ఒక్క రైలును మాత్రం ఆమె కోసం నడిపిస్తోంది. ఆ బాలిక గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక ఆ రైలును కూడా నిలిపేస్తామని ప్రభుత్వం పేర్కొంది. కేవలం ఒకే ఒక్క బాలిక కోసం అంత ఖర్చుతో రైలు నడిపిస్తున్న జపాన్ ప్రభుత్వం ప్రజల అభిమానం చూరగొంటోంది.