: ఏపీ బాట పట్టిన కేంద్ర మంత్రులు!... నేడు నలుగురు కేంద్ర మంత్రుల రాక
కేంద్ర కేబినెట్ లోని కీలక మంత్రులు ఏపీ బాట పట్టారు. నేడు ఒక్కరోజే మోదీ కేబినెట్ లోని నలుగురు కీలక మంత్రులు ఏపీ పర్యటనకు వస్తున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మరికాసేపట్లో విజయవాడలో పర్యటించనున్నారు. బీజేపీ సీనియర్ నేత, మరో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూతురు ఆధ్వర్యంలోని స్వర్ణ భారతి ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాజ్ నాథ్ విజయవాడకు వస్తున్నారు. ఇక కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నేడు విశాఖ రానున్నారు. నగరంలో మూడు రోజుల పాటు జరగనున్న భాగస్వామ్య సదస్సును ఆయన నేటి సాయంత్రం ప్రారంభించనున్నారు. ఈ సదస్సుకు జైట్లీతో పాటు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ కూడా హాజరవుతున్నారు. ఇక ఇప్పటికే విజయవాడలో ఉన్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడితో కలుపుకుంటే... కేంద్ర కేబినెట్ లోని ఐదుగురు కీలక మంత్రులు ఏపీలో ఉన్నట్లు లెక్క.