: తమిళ మంత్రి కార్యాలయంపై పెట్రోల్ బాంబు దాడి... మధురైలో కలకలం


తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కేబినెట్ లో మంత్రిగా ఉన్న సెల్లూరు రాజు కార్యాలయంపై నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత బాంబు దాడి జరిగింది. రాష్ట్రంలోని మధురైలోని మంత్రి సెల్లూరు రాజు కార్యాలయంపై గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ బాంబులతో విరుచుకుపడ్డారు. బాంబు దాడి జరిగిన సమయంలో కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ముప్పే తప్పింది. ఈ దాడిలో కార్యాలయం పాక్షికంగా దెబ్బతింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి పరుగులు పెట్టారు. మంత్రి కార్యాలయంపై దాడికి పాల్పడ్డ దుండగుల కోసం గాలింపు కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News