: కేజ్రీపై డీడీసీఏ పరువు నష్టం దావా... కీర్తి ఆజాద్ పై కూడా!


దేశ రాజకీయాల్లో సరికొత్త ఒరవడి సృష్టించి ఏడాది వ్యవధిలో రెండు పర్యాయాలు ఢిల్లీ సీఎం పోస్టును చేజిక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ కు వరుస ఇబ్బందులు తప్పడం లేదు. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) వివాదంలో ఇప్పటికే ఆయనపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పరువు నష్టం దావా వేశారు. తన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేజ్రీ, ఆయన పార్టీ నేతలు తన పరువుకు భంగం కలిగించారని, అందుకు పరిహారంగా రూ.10 కోట్ల మేర పరిహారం ఇప్పించాలని జైట్లీ పటియాలా హౌజ్ కోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్ పై కోర్టు తీర్పు వెలువడనే లేదు, కేజ్రీపై మరో పరువు నష్టం దావా దాఖలైంది. ఈ పిటిషన్ ను డీడీసీఏ నిన్న దాఖలు చేసింది. బోర్డు ఇమేజ్ ను దెబ్బతీసేలా కేజ్రీ వ్యవహరిస్తున్నారంటూ ఆ పిటిషన్ లో డీడీసీఏ ఆవేదన వ్యక్తం చేసింది. పనిలో పనిగా బోర్డు అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చిన బీజేపీ నేత, ఎంపీ కీర్తి ఆజాద్ పై కూడా డీడీసీఏ పరువు నష్టం దావా దాఖలు చేసింది.

  • Loading...

More Telugu News