: ఫంక్షన్ ఏదైనాసరే పవర్ స్టార్ ని తలచుకోవాల్సిందే: దిల్ రాజు
ఫంక్షన్ ఏదైనాసరే తాను పవర్ స్టార్ ని, సునీల్ మెగాస్టార్ ని తలచుకోవాల్సిందే నని నిర్మాత దిల్ రాజు అన్నారు. 'కృష్ణాష్టమి' ఆడియో వేడుకలో ఆయన మాట్లాడారు. ‘మెగా’ అభిమానుల ఫంక్షన్లలోనే కాదు వేరే ఫంక్షన్లలో కూడా పవర్ స్టార్ ను తలచుకోవాల్సిందేనని అన్నారు. చిరంజీవికి సునీల్, పవన్ కల్యాణ్ కు తాను పెద్ద ఫ్యాన్లమని దిల్ రాజు చెప్పారు.