: ప్రత్యేక హోదా వల్ల ఏపీకి ఉపయోగం ఉండదు: వెంకయ్య
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కొత్త గళాన్ని వినిపించారు. హోదా వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. ఏపీకి కేంద్రమే ప్రత్యేక గుర్తింపు ఇస్తోందని తెలిపారు. 18 నెలల్లో రాష్ట్రానికి ఎంతో సహాయం చేశామని, విభజనకు ముందు, తరువాత తూలనాడిన వారే ఆంధ్రావాళ్లని మంచివాళ్లని అంటున్నారని పేర్కొన్నారు. విజయవాడలో ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఈ మేరకు స్పందించారు. త్వరలో రియల్ ఎస్టేట్ బిల్లు తెస్తామని, రియల్ ప్లాన్లకు 30 రోజుల్లో అనుమతి ఇచ్చి తీరాల్సిందేనని వెంకయ్య చెప్పారు. ఇవ్వకపోతే ఇచ్చినట్టుగా భావించేలా చట్టం కూడా తెస్తున్నామని వెల్లడించారు. దాంతో బహుళ అంతస్తుల భవనాలకు ఎయిర్ ఫోర్స్, డిఫెన్స్, పర్యావరణ అనుమతులకు ఢిల్లీకి రావాల్సిన పనిలేదని స్పష్టం చేశారు.