: ఢిల్లీలో ఈ నెల 15తో ముగియనున్న సరి-బేసి విధానం


దేశ రాజధానిలో ప్రయోగాత్మకంగా చేపట్టిన సరి-బేసి విధానం ఈ నెల 15వ తేదీతో ముగియనుందని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. దీనిని మరింత పొడిగించడం లేదని, మరో ఆరు రోజుల పాటు మాత్రమే అమలు చేస్తామని ఢిల్లీ రవాణా శాఖ మంత్రి గోపాల్ రాయ్ వెల్లడించారు. ఈ 15 రోజుల ట్రయల్ రన్ పై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి, ఆ తరువాత దాని పొడిగింపు గురించి ఆలోచిస్తామని చెప్పారు. సరి-బేసి విధానం అమలుతో ఇబ్బందులు పడుతున్నామంటూ కొంతమంది ఢిల్లీ హైకోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు వారం రోజుల నివేదిక సమర్పించిన ప్రభుత్వం... కీలక సమయాల్లో కాలుష్యం తగ్గిందని తెలిపింది. అవసరమైతే మరింత పొడిగిస్తామని చెప్పింది.

  • Loading...

More Telugu News