: తెలంగాణపై నిర్ణయం తీసుకోండి.. టీఎంపీల ధర్నా


ప్రత్యేక తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. ఎంపీలు వివేక్, గుత్తా సుఖేందర్ రెడ్డి, మందా జగన్నాథం, పొన్నం ప్రభాకర్ ఢిల్లీలో పార్లమెంటు ప్రధాన ద్వారం ఎదుట ఎప్పటిలాగే ధర్నా నిర్వహించారు. ఇక లోక్ సభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. 2జీ, బొగ్గు కుంభకోణం తదితర అంశాలపై చర్చ చేపట్టాలని డిమాండు చేశాయి. దాంతో సభా కార్యక్రమాలు పూర్తిగా స్థంభించడంతో స్పీకర్ మీరా కుమార్ లోక్ సభను రేపటికి వాయిదా వేశారు. రాజ్యసభలోనూ ఇదే తీరు కనబడడంతో మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదాపడింది.

  • Loading...

More Telugu News