: సీఐఐ భాగస్వామ్య సదస్సు నేపథ్యంలో విశాఖలో భారీ భద్రత
విశాఖలో రేపటి నుంచి సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభం కాబోతుండటంతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకు 2వేల మంది పోలీసులు, ఆక్టోపస్, గ్రేహౌండ్స్ దళాలు, నేవీ, మెరైన్ పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని పోలీస్ కమిషనర్ అమిత్ గార్గ్ తెలిపారు. సదస్సు ప్రాంగణం దగ్గర 32 సీసీ కమెరాలతో నిఘా వేశామని చెప్పారు. విశాఖ నగరంలోని అన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ ను అనుసంధానం చేశామని, ఆర్కే బీచ్, హార్బర్ రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ప్రయాణికులు గమనించాలని గార్గ్ వివరించారు. విశాఖకు వచ్చే మార్గాల్లో 12 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, కమాండ్ కంట్రోల్ ద్వారా నిరంతరం నిఘా పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు.