: హిట్లర్ సూసైడ్ చేసుకోలేదు: వార్ క్రైం పరిశోధకుడు


నాజీ నియంత హిట్లర్ సూసైడ్ చేసుకోలేదని.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తాను త్వరలోనే వెల్లడిస్తానని అమెరికాకు చెందిన వార్ క్రైం పరిశోధకుడు జాన్ సెన్సిష్ అంటున్నాడు. హిట్లర్ కు చెందిన పలు దస్త్రాలపై జాన్ పరిశోధన చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘హిట్లర్ ఎత్తు 5 అడుగుల ఆరు అంగుళాలు. అందుకు భిన్నంగా హిట్లర్ మృతదేహం ఐదు అంగుళాలు తక్కువగా ఉంది. హిట్లర్ మృతదేహం వివరాల ఆధారంగా నేనీ విషయాన్ని చెప్పగలుగుతున్నాను' అన్నారు. హిట్లర్, ఆయన భార్య కలసి సెనరీ ద్వీపానికి పారిపోయి, అక్కడి నుంచి అర్జెంటీనాకు వెళ్లి జీవించారని తన పరిశోధనలో తేలిందన్నారు. హిట్లర్ తన భార్యతో కలిసి ఆత్మహత్యకు పాల్పడలేదని ఆయన అన్నారు. పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తానని ఈ పరిశోధకుడు చెప్పాడు.

  • Loading...

More Telugu News