: ‘చంద్రన్న’ కానుక గొప్ప పథకం: పౌరసరఫరాల శాఖ కమిషనర్


చంద్రన్న సంక్రాంతి కానుక ఒక గొప్ప ఆశయంతో చేపట్టిన పథకమని ఏపీ పౌరసరఫరాల శాఖ కమిషనర్ కరికల వలవన్ అన్నారు. సంక్రాంతి పండగను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలన్నదే ప్రభుత్వ ఆశయమని అన్నారు. సంక్రాంతి కానుక కింద 40 వేల టన్నుల ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్నామన్నారు. కాగా, తెల్లకార్డుదారులకు మామూలు రేషన్‌ సరకులతో పాటు ఈ పండగ స్పెషల్ కూడా అందజేస్తున్నారు. ఇక చంద్రన్న సంక్రాంతి కానుక కింద... కిలో గోధుమ పిండి, అరకిలో కందిపప్పు, అరకిలో శనగపప్పు, అరకిలో బెల్లం, అర లీటరు వంటనూనె, 100 గ్రాముల నెయ్యి వంటి ఆరు సరుకులను ఒక సంచిలో ఉంచి రేషన్ కార్డుదారులకు అందజేస్తారు.

  • Loading...

More Telugu News