: లాస్ వెగాస్ షోలో ఆకట్టుకుంటున్న 'వివో' ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు
అమెరికాలోని లాస్ వెగాస్ నగరంలో జరుగుతున్న కన్ జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో 'వివో' కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరించింది. 'బ్లూ వివో5', 'బ్లూ వివో ఎక్స్ ఎల్'ల పేరిట ప్రదర్శిస్తున్న ఈ ఫోన్ల ధరను గతంలోని వివో స్మార్ట్ ఫోన్ల కన్నా తక్కువగానే నిర్ణయించారు. అంతేగాక యూజర్లను అమితంగా ఆకట్టుకునే ఫీచర్లు వాటిలో అందిస్తున్నారు. బ్లూ వివో5 ధర రూ.13,250 ఉండగా, బ్లూ వివో ఎక్స్ ఎల్ ధర రూ.10వేలుగా నిర్ణయించారు. ప్రస్తుతం అమెరికాలోని కొన్ని స్టోర్స్, అమెజాన్ వెబ్ సైట్ ద్వారా ఈ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని రోజుల్లో ఇవి ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వస్తాయి.