: కనకదుర్గ ఆలయంలో భక్తులకు కుంకుమ పంపిణీ
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో కుంకుమ పంపిణీ కార్యక్రమాన్ని ఏపీ దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇక నుంచి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు 5 గ్రాముల కుంకుమ పంపిణీ చేస్తామన్నారు. కాగా, ఈ కుంకుమ పంపిణీకి రూ.36 లక్షలు కేటాయించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలోనే వస్తుంటారు. సమీప జిల్లాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల భక్తులు కూడా ప్రతి ఏటా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళుతుంటారు.