: ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, ఆయన తమ్ముడి వల్లే ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడ్డారు: టీడీపీ నేత విజయరమణారావు
కరీంనగర్ జిల్లా పెద్దపల్లి ఎస్ఐ జగన్ మోహన్ ఆత్మహత్యపై టీడీపీ నేత విజయరమణారావు స్పందించారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, ఆయన తమ్ముడి వేధింపుల వల్లే ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. అంతేగాక జగన్ మోహన్ రాసిన సూసైడ్ నోట్ ను వారిద్దరూ మార్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కాబట్టి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై హత్య కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమాజంలో నీతి నిజాయతీతో బతికే అవకాశం లేదని, పోలీసుల దగ్గర డబ్బులు తీసుకుని పోస్టింగులు ఇవ్వాలని సిఫారసు లేఖలు ఇస్తున్నారని విజయరమణారావు ఆవేదన వ్యక్తం చేశారు.