: పఠాన్ కోట్ ఎయిర్ బేస్ ను సందర్శించిన ప్రధాని
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొద్దిసేపటి కిందట పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ కు చేరుకున్నారు. వెంటనే అధికారులతో కలసి ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఇటీవల ఎయిర్ బేస్ పై జరిగిన ఉగ్రవాద దాడి ఘటన వివరాలను ఆర్మీ, ఉన్నతాధికారులు ఈ సందర్భంగా మోదీకి వివరించారు. అనంతరం ఎయిర్ బేస్ ను ఆయన పరిశీలించారు. తరువాత ఉగ్రవాదుల దాడిలో గాయపడిన సైనికులను మోదీ కలుసుకుని పరామర్శించనున్నారని తెలుస్తోంది. అనంతరం ఆర్మీ అధికారులతో మోదీ సమీక్ష నిర్వహిస్తారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఎయిర్ బేస్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు.