: ఆసీస్ సిరీస్ కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ... ప్రాక్టీస్ మ్యాచ్ లో షమీకి గాయం
ఆసీస్ టూరుకు వెళ్లిన టీమిండియాకు సిరీస్ మొదలుకాకముంటే ఎదురుదెబ్బ తగిలింది. తొడ కండరాలు పట్టేసిన జట్టు ఫాస్ట్ బౌలర్ మొహ్మద్ షమీ దాదాపుగా జట్టుకు దూరమైనట్టుగానే కనిపిస్తోంది. నిన్న ఆస్ట్రేలియా దేశవాళీ జట్టుతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో తొడ కండరాలు పట్టేయడంతో షమీ బౌలింగ్ కూడా కొనసాగించలేకపోయాడు. దీంతో అతడు మ్యాచ్ మధ్యలోనే నిష్క్రమించాల్సి వచ్చింది. అయితే సిరీస్ కు అతడు అందుబాటులో ఉంటాడా? లేదా? అన్న విషయంపై బీసీసీఐ నోరు విప్పడం లేదు. నేడు అందనున్న వైద్య నివేదిక తర్వాత షమీ విషయంపై తుది నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.