: వాతావరణ సూచనల్లో భారీ మార్పులు... ఇక అనుమానాలకు ‘అవకాశం‘ లేదు


వర్షాలు కురిసే అవకాశం ఉంది... వడ గాల్పులు వీయవచ్చు... ఒకట్రెండు చోట్ల వర్షాలు కురవవచ్చు.. అని వాతావరణశాఖ అధికారులు చెబుతుంటే అసలు ఏం జరగబోతోందో మనకు అర్థం కాదు... ఇకపై ఇటువంటి అనుమానాలకు వాతావరణశాఖ చెక్ పెట్టాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఇకపై వాతావరణ సూచనల్లో 'అవకాశం ఉంది' లాంటి తెగ అనుమానపు పదాలకు తెరదించనుంది. వీటి స్థానంలో వీలైనంత వరకూ నిర్ధారిత పదాలనే వాడాలని నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎక్కడెక్కడ వర్షాలు పడతాయో తెలియజేయడంతోపాటు, ఉష్ణోగ్రతలు చెప్పే విధానంలోనూ మార్పులు తీసుకురానున్నారు.

  • Loading...

More Telugu News