: తెరపైకి సల్వీందర్ రెండో భార్య... పంజాబ్ వివాదాస్పద 'ఎస్పీ' కేసులో కొత్త ట్విస్ట్
ఇప్పటికే పఠాన్ కోట్ ఘటనలో ప్రమేయం ఉందన్న కేసులో పీకల్లోతు మునిగిపోయిన పంజాబ్ ఎస్పీకి ఇప్పుడు కొత్త చిక్కులు ఎదురయ్యాయి. ఒక మహిళ తాను సల్వీందర్ రెండవ భార్యనంటూ, తన కొడుకును చూపిస్తూ మరీ తన వాదనను వినిపిస్తోంది. ఆమె చెప్పిన వివరాల ప్రకారం తన 16 సంవత్సరాల కుమారునికి సల్వీందరే తండ్రంటూ, అవసరమైతే డిఎన్ఎ పరీక్షలు చేయించాలని కోరుతోంది. తనను సల్వీందర్ మోసం చేశాడని ఆమె ఆరోపిస్తోంది. దీంతో పంజాబ్ డీజీపీ జోక్యం చేసుకుని, ఎస్పీ సల్వీందర్ సింగ్ రెండవ వివాహంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయాలని ఆదేశించారు. కాగా సల్వీందర్ మాయలోపడి తన అక్క మోసపోయిందంటూ బాధితురాలి చెల్లెలు ఒక వీడియో ఫుటేజ్ ను కూడా విడుదల చేయడం విశేషం.