: ఏపీలో కేసీఆర్ ఫ్లెక్సీ... కాంట్రాక్టు ఉద్యోగుల వినూత్న చర్య
గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ టీఆర్ఎస్ ఫ్లెక్సీలతో భాగ్యనగరి పింక్ సిటీగా మారిపోయిందని జాతీయ మీడియా ఇటీవల ఆసక్తికర కథనాలు రాసింది. ఈ కథనాల కంటే కూడా నిన్న ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో మరింత ఆసక్తి రేకెత్తించే విషయం వెలుగుచూసింది. జిల్లాలోని వై.రామవరంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును కీర్తిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. ‘‘తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగుల చీకటి జీవితాలకు వెలుగును ప్రసాదించిన ముఖ్యమంత్రివర్యులు’ అన్న విశేషణంతో వెలసిన ఆ ఫ్లెక్సీలో కేసీఆర్ కు ‘శతకోటి అభివందనములు’ అని పేర్కొంటూ వై.రామవరం మండల కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం సరదు ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది. అయితే ఈ ఫ్లెక్సీలు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడును అవమానించినట్లుగానే ఉన్నాయన్న భావనతో వాటిని తొలగించాలని స్థానిక టీడీపీ నేతలు పంచాయతీ కార్యదర్శిని ఆదేశించినట్లుగా సమాచారం.