: కోడి పందాలు గ్రామాభివృద్ధికి కారణమవుతున్నాయి: మాగంటి బాబు
కోడి పందాలు గ్రామాభివృద్ధికి కారణమవుతున్నాయని ఎంపీ మాగంటి బాబు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం జగన్నాథపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో పాల్గొనడానికి వచ్చిన ఆయన మాట్లాడుతూ, కోడి పందాలు తరాలుగా వస్తున్న సంప్రదాయ క్రీడలని అన్నారు. న్యాయస్థానం తీర్పును గౌరవిస్తున్నామని తెలిపిన ఆయన, కోడి పందాల నిర్వహణపై జీవో తీసుకొస్తామని చెప్పారు. కోడి పందాలు వీక్షించేందుకు గ్రామాలకు వచ్చే ఎన్ఆర్ఐలు గ్రామాభివృద్ధికి నిధులు ఇస్తారని ఆయన చెప్పారు. జిల్లాలో గ్రామాభివృద్ధికి 12 వేల మంది ఎన్ఆర్ఐలు ముందుకి వస్తున్నారని ఆయన తెలిపారు.