: క్రికెట్ బ్యాట్ పట్టిన బాలయ్య!
టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ క్రికెట్ బ్యాట్ పట్టి సందడి చేశారు. అనంతపురం జిల్లా హిందూపురంలోని ఎంజీఎం మైదానంలో నందమూరి తారకరామారావు స్మారక క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. తొలుత శాంతి కపోతాలను ఎగురవేశారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ, క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో వ్యవహరించాలని అన్నారు. క్రీడలు జీవితానికి ఎంతో స్ఫూర్తినిస్తాయని, వాటి ద్వారా ఎంతో నేర్చుకోవచ్చని చెప్పారు. క్రీడాకారులు, అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.