: జీహెచ్ఎంసీ మేయర్ పదవి బీసీ జనరల్ కు కేటాయింపు
జీహెచ్ఎంసీ మేయర్ పదవిని బీసీ జనరల్ కు కేటాయిస్తున్నట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ తాజాగా ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాదు ఎన్నికల వార్డులకు సంబంధించిన రిజర్వేషన్ల వివరాలను ఈ సాయంకాలం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మేయర్ పదివిపై మాత్రం ప్రత్యేకంగా ఇప్పుడు ప్రకటన చేయడం విశేషం. దీంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రిజర్వేషన్ల వ్యవహారం ముగిసినట్టైంది.