: వారసత్వంగా ఎన్నికైంది కదా, అలానే అంటుంది: సుప్రియా సూలేపై షాజియా ఇల్మి
పార్లమెంటులో చీరలు, మేకప్ గురించి చర్చించుకుంటామని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే చేసిన వ్యాఖ్యలపై పలువురు నేతలు మండిపడుతున్నారు. బీజేపీ నేత షాజియా ఇల్మి మాట్లాడుతూ, పార్లమెంటుపై కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చిస్తున్నది పలు అంశాలు ప్రస్తావించేందుకే తప్ప చీరలు, మేకప్ లపై చర్చించేందుకు కాదని అన్నారు. సుప్రియా సూలేకు ఎంపీ పదవి వారసత్వంగా రావడం వల్లే అలా అభిప్రాయపడిందని ఆమె అన్నారు. ఆమెకు ప్రజా సమస్యలపై ఎలాంటి బాధ్యత లేదని, అందుకే కట్టుకునే చీరలు, వేసుకునే మేకప్ పైనే ఆమెకు ధ్యాస ఎక్కువని ఆమె అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని, పార్లమెంటులో వాస్తవంగా ఏం చేస్తారో సుప్రియ తెలుసుకోవాలని ఆమె వ్యాఖ్యానించారు.