: అనుమతులు లేవట... మావో విగ్రహాన్ని కూల్చేశారు


చైనాలోని హెనాన్ ప్రావిన్స్ లో గల టాంగ్జూ కౌంటీలో ఇటీవల చైనా కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ రూపంతో 37 మీటర్ల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మావో అభిమానులు, స్థానిక రైతులు, వ్యాపారవేత్తల నుంచి సేకరించిన విరాళాలతో ఈ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహ ఏర్పాటుకు 4.6 లక్షల అమెరికన్ డాలర్లు ఖర్చు చేశారు. సిమెంటు, కాంక్రీటుతో చేసిన ఈ 37 మీటర్ల భారీ విగ్రహానికి బంగారు రంగు కూడా వేశారు. అయితే ఈ భారీ విగ్రహ ఏర్పాటుకు అనుమతులు లేవంటూ అధికారులు తాజాగా దీనిని కూల్చేశారు.

  • Loading...

More Telugu News