: ‘ఉగ్ర’ కర్కశత్వం.. కన్నతల్లిని కాల్చేసిన ఐఎస్ ఉగ్రవాది!


బహిరంగంగా బిడ్డకు పాలివ్వడం తమ నిబంధనల ప్రకారం నేరమని ఒక తల్లిని తుపాకీతో కాల్చడం, అభం శుభం ఎరుగని నాలుగేళ్ల బాలుడి దేహానికి పేలుడు పదార్థాలు కట్టి రిమోట్ ద్వారా పేల్చేయడం వంటి దారుణాలకు పాల్పడుతున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల కర్కశత్వానికి మరో తాజా ఉదాహరణ. ఐఎస్ ఉగ్రవాది తన కన్నతల్లినే కాల్చేసిన సంఘటన సిరియాలోని రఖాలో జరిగింది. సిరియన్ అబ్జర్వేటరీ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం... రఖాలో ఉండే అలీ సకర్ అల్ ఖాసిమ్ అనే ఇరవై సంవత్సరాల ఉగ్రవాదిని ఐఎస్ లో నుంచి బయటకు వచ్చేయమని అతని తల్లి లెనా(45) నచ్చచెప్పడానికి ప్రయత్నించింది. రఖా నుంచి పారిపోయి వేరే చోటకు పారిపోదామని తన కుమారుడి గడ్డం పట్టుకుని ప్రేమగా చెప్పింది. అయితే, తల్లి మాటలు ఖాసిమ్ తలకు ఎక్కలేదు సరికదా, ఆమెపై కక్ష పెంచుకున్నాడు. దాంతో రద్దీగా ఉండే ఒక ప్రాంతానికి ఆమెను తీసుకువెళ్లి... ప్రజలందరూ చూస్తుండగా తల్లి తలకు తుపాకీ గురిపెట్టి కాల్చేశాడని సదరు సంస్థ పేర్కొంది.

  • Loading...

More Telugu News